Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో కుమార్తె న్యూడ్ ఫోటోల వైరల్.. తండ్రి ఏం చేశాడంటే...

Webdunia
శనివారం, 6 జులై 2019 (13:45 IST)
కన్నబిడ్డ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో కావడంతో కన్నతండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన మృతుని సోదరుడు గుండె ఆగిపోవడంతో ప్రాణాలు విడిచాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా కౌలా అనే గ్రామంలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ యువతికి, అదే గ్రామానికి చెందిన మరో యువకుడికి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగుతూ వచ్చినట్టు  సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. 
 
ఈ క్రమంలో యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో, కేసు పెట్టిన పోలీసులు, యువకుడి కుటుంబంలోని ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. వారంతా ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. వీరంతా యువతి తల్లిదండ్రులపై పగ పెంచుకున్నారు. 
 
దీనికి ప్రతీకారంగా ఆ యువతితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను గ్రామంలోని గ్రూప్‌లలో, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఈ విషయం బాధిత యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా తీవ్ర మనస్తాపం చెందారు. 
 
ఈ నేపథ్యంలో ఆ యువతి తండ్రి అవమాన భారాన్ని భరించలేక గ్రామం సమీపంలోని అడవిలో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. తన సోదరుని మరణ వార్తను విన్న ఆయన తమ్ముడు గుండెపోటుకు గురై ప్రాణాలొదిలాడు. ఇద్దరి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం