Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోషల్ మీడియాకు అతుక్కుపోయేవాళ్ళు చదవాల్సిన సమాచారం.. (Video)

సోషల్ మీడియాకు అతుక్కుపోయేవాళ్ళు చదవాల్సిన సమాచారం.. (Video)
, శనివారం, 6 జులై 2019 (12:51 IST)
అమ్మాయిలు ఇష్టమొచ్చినట్లు సెల్ఫీలు దిగి సోషియల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారా.. వీడియోలను కూడా అంతర్జాలంలోకి వదిలేస్తున్నారు. అయితే వాళ్ల పని అయిపోయినట్లే. అదెలా తెలియాలంటే చదవండి..
 
24 గంటలు సోషల్ మీడియాలో గడపడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. ఫేస్ బుక్, వాట్సాప్ ఉంటే చాలు పక్కన ఎవరున్నా కనిపించరు. వాళ్ళ లోకం వాళ్ళదే. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా అంతే. ఫేస్ బుక్, వాట్సాప్ తెగ వాడేస్తున్నారు. వాళ్ళేంటో వాళ్ళ చాటింగ్‌లు ఏంటో, వీడియో కాలింగ్‌లు ఏంటో సెల్ఫీలు దిగుతూ ఎప్పటికప్పుడు పోస్టింగ్‌లు చేస్తూ కటింగ్‌లు ఇస్తుంటారు.
 
ఆ పోటోలకు వచ్చే లైక్‌లు కామెంట్లను చూసి మురిసిపోతుంటారు. ఇదే అదనుగా భావించిన కొందరు వంకర బుద్థిగాళ్ళు తమ పనితనం చూపిస్తున్నారు. అమ్మాయిల ఫోటోలు, వీడియోలను కాపీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సైబర్ క్రైం నేరగాళ్ళకు చిక్కే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. కొన్నాళ్ళ క్రితం సైబర్ క్రైం పోలీసులకు చిక్కిన దొంగల ముఠాలోని వారందరూ చదువుకుంది 7, 9తరగతులే. కానీ వీరు చేసిన చోరీలను చూసిన పోలీసు అధికారులు షాకయ్యారు. 
 
ఇప్పుడున్న టెక్నాలజీని వీరు వాడినంతగా సాఫ్ట్వేర్ ఐటి నిపుణులు కూడా వాడడం లేదని గుర్తించి హడలిపోతున్నారు. దీన్నిబట్టి వీరు చేస్తున్న నేరాలు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. తాజాగా సైబరాబాద్ పోలీసులకు చిక్కిన నిందితుడు వినోద్ చేసిన నేరానికి ఏకంగా 300 మంది అమ్మాయిల జీవితాలు అతలాకుతలం అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
 
ఇంటర్ కూడా పాస్ కాని వాడు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ వంటివి పూర్తిగా చదవేశాడు. ఎపిలోని పాడేరుకు చెందిన వినోద్ వైజాగ్‌లో ఉంటాడు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ట్రై చేశాడు. కానీ కాయకష్టం చేస్తే చిల్లర డబ్బులు మాత్రమే వస్తుందని గుర్తించాడు.
 
ఇలా చేస్తే భారీ డబ్బులు సంపాదించడం కష్టమని తెలుసుకున్నాడు. ఈజీ మనీ ఎలా సంపాదించుకోవాలో వెతికాడు. వెతక్కా.. వెతక్కా.. తన సోషల్ మీడియా అబ్జర్వేషన్లో ఒక విషయం బయటపడింది. అమ్మాయిల ఫోటోలను కాపీలు చేసి వారి ముఖాన్ని వేరే శరీరాలతో జతచేసి పోర్న్ సైట్లలో పెట్టాడు. అంతేకాదు వారి నెంబర్లను జతచేశాడు. పోర్న్ సైట్లను చూసే ఆకతాయిలు ఈ నెంబర్లు చూసి ఫోన్ చేయడం మొదలుపెట్టేవారు.
 
తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో అర్థం కాక బాధపడేవారు. కొంతమందైతే సుసైడ్ వరకు వెళ్ళారు కూడా. అయితే అలాంటి వారికి ఫోన్ చేసి నేనొక ఐటీ నిపుణుడినని చెప్పి మీ ఫోటోలను పోర్న్ సైట్లో నుంచి తీసేస్తానని చెప్పి నమ్మించేవాడు. విసిగిపోయిన అమ్మాయిలు వినోద్ ఎంత అడిగితే అంత అప్పజెప్పేవారు. ఇలా 300 మందిని మోసం చేశాడు వినోద్. తాజాగా ఒక అమ్మాయి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూతురు, అల్లుడిని పరిగెత్తించి వేటకొడవలితో నరికిచంపాడు.. ఎక్కడ?