Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ-పెళ్లితో మోసం.. బిడ్డను అమ్మేశాడు.. భార్యను కూడా ఏడుగురు పిల్లలకు తల్లిగా?

ప్రేమతో మోసం చేశాడు. అత్యాచారం చేశాడు. పెళ్లి మాటెత్తేసరికి చీదరించుకున్నాడు. కానీ కుల పెద్దల ఒత్తిడితో యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ముందే గర్భం ధరించిన మహిళ.. పెళ్లైన తర్వాత ఓ ఆడపిల్లకు జన్మ

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (16:32 IST)
ప్రేమతో మోసం చేశాడు. అత్యాచారం చేశాడు. పెళ్లి మాటెత్తేసరికి చీదరించుకున్నాడు. కానీ కుల పెద్దల ఒత్తిడితో యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి ముందే గర్భం ధరించిన మహిళ.. పెళ్లైన తర్వాత ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన బిడ్డపై అతనికి ఏమాత్రం ప్రేమ లేదు. ఇంకా రూ.25వేలకు మరో జంటకు ఆ బిడ్డను అమ్మేశాడు. ఆపై భార్యను వేధించడం మొదలెట్టాడు. ఏడుగురు పిల్లలున్న ఓ వయసు మళ్లిన వ్యక్తికి తన భార్యను అమ్మేయాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి ఇంటి నుంచి పారిపోయింది. పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. 2013లో ఎంబ్రాయిడరీ డిజైనర్‌గా పనిచేస్తున్న మహిళకు షావెజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమ- శారీరక సంబంధాల వరకు వచ్చింది. ఓ రోజు పెళ్ళి చేసుకుంటానని.. మాటిచ్చి లోబరుచుకున్నాడు. చివరికి ఆమె ప్రెగ్నెంట్ అని తేలడంతో పెళ్ళి చేసుకోనన్నాడు. బయట చెప్తే చంపేస్తానన్నాడు. ఈ వ్యవహారం కులపెద్దలకు తెలియడంతో.. పంచాయతీ పెట్టి బలవంతంగా షావెజ్‌ను పెళ్ళికి ఒప్పించారు. 
 
పెళ్లయ్యాక పాప పుట్టడంతో.. పాపను వద్దనుకున్న షావెజ్ రూ.25వేలకు మరో జంటకు అమ్మేశాడు. అనంతరం ఓ ఏడుగురు పిల్లల తండ్రితో ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నాడు. విడాకుల కోసం డిమాండ్ చేశాడు. ఇలా వేధింపులను ఎదుర్కొంటున్న క్రమంలో.. బాధిత మహిళ ఇంటినుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు షావెజ్‌పై ఐపీసీ సెక్షన్-376 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన బిడ్డను తనకిచ్చేయాలని.. షావేజ్‌కు తగిన శిక్ష పడాలని బాధిత మహిళ డిమాండ్ చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments