Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కష్టకాలంలో... ఇంటి ఖర్చులు కోసం కన్నబిడ్డ అమ్మకం!

Webdunia
సోమవారం, 17 మే 2021 (09:01 IST)
కరోనా కష్టకాలంలో చాలా కుటుంబాలకు పూటగడవడం కష్టసాధ్యంగా మారింది. దీంతో చేయకూడని పనులు చేస్తున్నారు. ముఖ్యంగా, తమ కన్నబిడ్డలను కూడా తెగనమ్ముతున్నారు. తాజాగా ఓ కుటుంబం పూటగడవడం కోసం కన్నబిడ్డను అమ్మేసి, కిడ్నాప్ నాటకం ఆడారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్‌లోగ‌ల డాబర్ తలాబ్ కాలనీలో ఇటీవల 14 రోజుల చిన్నారిని అపహరణకు గురైంది. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ విచారణలో... ఇంటి ఖర్చుల కోసం ఒక జంట‌ తమ బిడ్డను విక్ర‌యించిన‌ట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
లోనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాబర్ చెరువు ప్రాంతానికి చెందిన‌ ఒక జంట తమ 14 రోజుల శిశువును విక్రయించారు. అయితే దీనిపై ఎవ‌రికీ అనుమానం రాకుండా ఉండేందుకు వారు త‌మ‌ 14 రోజుల శిశువును ఎవ‌రో అప‌హ‌రించార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
 
ఈ విష‌య‌మై బాధితులు ర‌క‌ర‌కాలుగా చెబుతుండ‌టంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి చుట్టుపక్కల వారిని విచారించారు. ఈ నేప‌థ్యంలో ఒక జంట బాధితుల‌ ఇంటికి వచ్చినట్లు తెలిసింది. త‌ర్వాత వారు రెండు పెద్ద సంచుల‌తో బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లు స్థానికులు తెలిపారు. 
 
దీంతో పోలీసులు ఆ శిశువు తండ్రిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించారు. త‌మ ఇంటి ఖర్చుల కోసం పిల్ల‌వాడిని విక్ర‌యించిన‌ట్లు అత‌ను పోలీసుల‌కు తెలిపాడు. 
 
కాగా, యాచ‌న చేస్తూ జీవనం సాగిస్తున్న ఆ జంట‌ మూడేళ్ల క్రితం కూడా తమ కుమారుడిని లక్ష రూపాయలకు విక్ర‌యించారు. ఆ పిల్లవాడిని కొన్నవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments