పరీక్షలో ఒక్క పదం తప్పు రాశాడనీ విద్యార్థిని చావబాదిన టీచర్.. తర్వాత ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (09:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పరీక్షలో తప్పు రాశాడనీ చావబాదాడు. ఈ దెబ్బలు తీవ్రంగా తగలడంతో ఆ విద్యార్థి స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ విద్యార్థి ఆస్పత్రిలో 18 రోజుల పాటు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన యూపీని ఔరైయా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అఛల్దా పోలీస్‌స్టేషను పరిధిలోని ఆదర్శ్‌ కళాశాలలో వైషోలి గ్రామానికి చెందిన నిఖిత్‌ కుమార్‌ (15) పదో తరగతి చదువుతున్నాడు. సెప్టెంబరు 7న సైన్స్‌ టీచర్‌ అశ్వనీసింగ్‌ ఓ పరీక్ష నిర్వహించారు.
 
ఆ పరీక్షలో ఒకే ఒక్క పదాన్ని నిఖిత్ తప్పుగా రాశాడు. దీంతో పట్టరాని కోపంతో విద్యార్థి జట్టు పట్టుకొని కర్రతో టీచర్ దారుణంగా చావబాదాడు. దీంతో నిఖిత్‌ స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన బాలుణ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
 
మెరుగైన వైద్యం కోసం లక్నో వెళ్లినా ఉపయోగం లేకపోయింది. కళాశాల ప్రిన్సిపాల్‌ సూచన మేరకు  నిఖిత్‌ వైద్య ఖర్చు రూ.40 వేలు.. అశ్వనీసింగ్‌ భరించారు. చికిత్స పొందుతూ సోమవారం నిఖిత్‌ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments