Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బతికేవున్నాడు.. కోమాలో వున్నాడని ఏడాది పాటు ఇంట్లోనే మృతదేహం

Advertiesment
deadbody
, శనివారం, 24 సెప్టెంబరు 2022 (10:33 IST)
యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఏడాది పాటు ఓ ఫ్యామిలీ మృతదేహాన్ని ఇంట్లోనే వుంచుకుంది. కనీసం మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. దీంతో డెడ్ బాడీ కుళ్లిపోయింది. ఎంతగా అంటే.. ఎముకల్లోని మజ్జ కూడా ఇంకిపోయేంతగా.. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటన యూపీ శివపురిలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఆయన అహ్మదాబాద్​లో ఐటీలో విధులు నిర్వహిస్తూ 2021 ఏప్రిల్​ 22న మృతి చెందాడు. అయితే కుటుంబసభ్యులు అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించలేదు. 
 
విమలేశ్ కనిపించకపోవడంతో గ్రామస్థులు ఆరా తీశారు. అయితే విమలేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడు కోమాలో ఉన్నాడని డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని అందరినీ నమ్మించారు. 
 
కానీ పెన్షన్‌కు అప్లై చేసుకునేందుకు విమలేశ్​మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆమె సమర్పించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన ఆదాయ పన్నుశాఖ ఈ విషయాన్ని సీఎంవోకు తెలిపింది. 
 
వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎంఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు విమలేశ్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అంబులెన్స్​లో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాపీ డాటర్స్ డే: లింగ బేధం వద్దు.. వారికి అన్నీ సమకూర్చండి.. ఉన్నత శిఖరాలను..?