Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి ఉత్తరప్రదేశ్ విద్యా మంత్రి మృతి

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2020 (12:49 IST)
కరోనా వైరస్ సోకి మరో రాజకీయ నేత ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖామంత్రిగా ఉన్న కమలారాణి వరుణ్  చనిపోయారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌ బారినపడిన ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. అయితే, లక్నోలోని సంజ‌య్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆమె మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. 
 
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటూ వచ్చారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. కాగా, గతంలో ఆమె లోక్‌సభ సభ్యురాలిగానూ పనిచేశారు. ఆమెకు ఓ కుమార్తె ఉంది. కమలారాణి  మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. 
 
ఇదిలావుండగా, శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు చనిపోయిన విషయం తెల్సిందే. ఈయనకు కూడా గత పది రోజుల క్రితం వైరస్ సోకింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన శనివారం మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments