రూ.476 కోట్ల విలువైన విమానం నీటిపాలు!

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (12:45 IST)
అమెరికా నౌకా దళానికి చెందిన రూ.476 కోట్ల విలువైన యుద్ధ విమానం ఒకటి నీటిపాలైంది. యూఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ విమానవాహక నౌక పైనుంచి ఈ విమానం ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయింది. ఈ నెల 28 తేదీ ఆదివారం ఎర్ర సముద్రంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్ స్క్వాడ్రన్ 136కు చెందిన సుమారు 56 మిలియన్ డాలర్ల భారతీయ కరెన్సీలో రూ.476 కోట్ల విలువైన ఎఫ్/ఏ-18ఈ సూపర్ హార్నెట్ రకం యుద్ధ విమానాన్ని నౌకలోని హ్యాంగర్ బేలో టోయింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
యెమెన్‌లోని హౌతీ రెబల్స్ నిర్వహించిన క్షిపణి, డ్రోన్ల దాడి నుంచి తప్పించుకునేందుకు నౌక ఆకస్మికంగా గట్టి ములుపుతీసుకుందని, ఆ సమయంలో విమానాన్ని లాగుతున్న సిబ్బంది దానిపై నియంత్రణ కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఫైటర్ జెట్, దానిని లాగుతున్న టో ట్రాక్టర్‌తో సహా సముద్రంలో జారిపోయినట్టు యూఎస్ నేవీ ఓ పత్రికా ప్రకటనలో ధృవీకరించింది.  
 
విమానాన్ని హ్యాంగర్ బే టో చేస్తుండగా సిబ్బంది నియంత్రణ కోల్పోయారు. విమానం, టో ట్రాక్టర్ సముద్రంలో పడిపోయాయి. విమానం పడే ముందు సిబ్బంది అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. ఒక నావికుడుకి మాత్రం స్వల్ప గాయమైంది అని నేవీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments