Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత ప్రజాదారణ కలిగిన నేతల జాబితాలో ప్రధాని మోడీకి అగ్రస్థానం

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (14:55 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచంలో అత్యంత ప్రజాదారణ కలిగిన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందడమే కాకుండా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. 
 
గత 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా తన పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల నేతల్లో మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.
 
సంపన్నదేశాల అధ్యక్షులు కూడా ప్రధాని మోడీ దరిదాపుల్లో లేరు. అమెరికన్ పరిశోధనా సంస్థ.. మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లలో అత్యధిక శాతం రేటింగ్‌లతో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. 
 
ఈ విషయాన్ని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్​ ఈ వివరాలను ట్విట్టర్​లో షేర్ చేశారు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏ నాయకుడికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహిస్తోంది. 
 
గతేడాది కూడా మోడీనే మొదటి స్థానంలో నిలిచారు. ఈసారి సర్వేలో భారత్​లో 2,126 మందిని ఆన్​లైన్ ఇంటర్వ్యూ చేసింది మార్నింగ్ కన్సల్ట్​. ఈ సర్వే ప్రకారం, ఈ ఏడాది మోడీ 70 శాతం ఓట్లతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు.
 
మెక్సికో అధ్యక్షుడు లోపెజ్​ ఒబ్రేడర్ 66 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58 శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్​ టాప్​ 10లో చివరిస్థానంలో నిలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments