Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోరం.. ఓ వ్యక్తిపై నలుగురు వ్యక్తుల అత్యాచారం.. ఎక్కడ..?

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (08:56 IST)
దేశంలో మహిళలపైనే కామాంధులు విరుచుకుపడుతున్నారంటే.. ఇక్కడ ఓ వ్యక్తిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని మరో నలుగురు వ్యక్తులు కలిసి అత్యాచారం చేయడమే కాక ఆ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి బాధితున్ని బెదిరించారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ దృశ్యాలను ఇంటర్నెట్‌లో పెడతామని హెచ్చరించారు. బాధితున్ని భయపెట్టారు. అతని నుంచి డబ్బులు లాక్కున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఓ యువకుడు (20) గ్రిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా మరో నలుగురు వ్యక్తులకు పరిచయం అయ్యాడు. అతన్ని వారు ఒక ప్రదేశానికి రప్పించారు. అనంతరం అతనిపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో ఫోన్లతో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. దీంతో భయపడ్డ బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించాడు. అయితే వారు అతన్ని ఆపి డబ్బులు ఇవ్వాలని లేదంటే ఆ దృశ్యాలను బయటకు విడుదల చేస్తామని బెదిరించారు.
 
ఈ క్రమంలోనే బాధిత యువకుడి నుంచి ఫోన్ పే యాప్ ద్వారా వారు రూ.5వేలను తమ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. అయితే అక్కడి నుంచి పారిపోయిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో గౌతమ్‌, గౌరవ్ అనే ఇద్దరు యువకులు సోదరులు కాగా సచిన్‌, మోహిత్ అనే మరో ఇద్దరు యువకులు ఉన్నారు. 
 
వారు గతంలోనూ ఇలాగే ఓ వ్యక్తి నుంచి రూ.1.80 కోట్లను దోపిడీ చేసేందుకు యత్నించారు. కాగా ఆ బాధిత యువకుడికి చెందిన 12 వీడియో క్లిప్స్‌ను వారి ఫోన్లలో గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments