తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎలా వుందంటే..?

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (23:15 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎలా వుందంటే.. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతలో చాలావరకు తగ్గిందనే చెప్పాలి. గత కొద్ది వారాలుగా రాష్ట్రంలో కరోనా పాజిటీవ్‌ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,01,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,396 కొత్త కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,271 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అదే సమయంలో 11,135 మంది కరోనా నుంచి కోలుకోగా, 61 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 10 మంది కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11,824 మంది కొవిడ్ బారినపడి ప్రాణాలు విడిచారు. మొత్తం 17,96,122 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటిదాకా 16,88,198 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 96,100 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇకపోతే.. తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,707 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 2,493 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 6,00,318కి పెరిగాయి. వీరిలో 5,74,103 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇంకా 22,759 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు మొత్తం 3,456 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,24,066 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జక్కన్న చెక్కేశాడు.. వారణాసి కోసం కాశీ సెట్స్ అదుర్స్.. ఫోటోలు వైరల్

Dil Raju: బ్యాండ్ ఆర్టిస్ట్ కి గౌరవం తెచ్చేలా దేత్తడి ఉంటుంది : దిల్ రాజు

Sanjay Dutt: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ

'పంజుర్లి' హావభావాలు ప్రదర్శించి చిక్కుల్లో పడిన 'ధురంధర్' హీరో

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కోసం హృతిక్ రోషన్, ర్యాన్ గాస్లింగ్ ప్రత్యేక సంభాషణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

తర్వాతి కథనం
Show comments