UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

సెల్వి
బుధవారం, 20 ఆగస్టు 2025 (21:53 IST)
UP man
ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో కానీ.. ప్రియుడితో సన్నిహితంగా వున్న భార్యకు భర్తే పెళ్లి చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భార్య తన ప్రియుడితో కలిసి భర్త కంటికి చిక్కింది. దీంతో ఆ భర్త ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దగ్గరుండి ప్రియుడితో భార్యకు పెళ్లి జరిపించాడు. 
 
వివరాల్లోకి వెళ్తే.. మీర్జాపూర్‌ జిల్లాని అర్వింద్ పటేల్ అనే వ్యక్తి.. చందౌలి జిల్లా హమీద్‌పూర్‌కు చెందిన రీనా అనే మహిళను 25 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకు సియారామ్‌ యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వాళ్ల పరిచయమే క్రమంగా వివాహేతర సంబంధం వరకు దారి తీసింది. దాదాపు 20 ఏళ్లుగా వీళ్ల మధ్య వివాహేతర సంబంధం అలా సాగుతూనే వస్తోంది. 
 
అర్వింద్‌ పటేల్‌కు వాళ్లపై అనుమానం రావడంతో పలుసార్లు పట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఈసారి రెడ్‌ హ్యాండెడ్‌గా వాళ్లిద్దరూ దొరికిపోయారు. ఈ ఘటనపై అర్వింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సియారామ్, అలాగే తన భార్య కుటుంబీకులకు కూడా ఈ విషయం చెప్పాడు. 
 
ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడాడు. చివరికి వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ల కుటుంబ సభ్యులను కూడా ఒప్పించాడు. ఈ క్రమంలోనే వారణాసిలోని ఓ గుడిలో వాళ్లకు పెళ్లి జరిపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments