Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీల్స్ పిచ్చి.. అచ్చం శవంలా పడుకున్నాడు.. చిప్పకూడు తప్పలేదు (video)

సెల్వి
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (11:38 IST)
young man
రీల్స్ పిచ్చి బాగా ముదిరింది. రీల్స్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇక్కడ రీల్స్ కోసం ఓ వ్యక్తి నడిరోడ్డుపై శవంలా పడుకున్నాడు. అలా అత‌డు న‌డిరోడ్డుపై శవంలా ప‌డుకుంటే.. అత‌ని స్నేహితులు దాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేయాలనుకున్నారు. కానీ చివరికి చిప్పకూడు తినాల్సి వచ్చింది. 
 
యూపీలోని కస్‌గంజ్‌ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమంలో పేరు తెచ్చుకోవడానికి 23 ఏళ్ల ముకేశ్‌ కుమార్‌ నడిరోడ్డుపై అచ్చం శవంలా పడుకున్నాడు. అలా శవంలా నడిరోడ్డుపై ఉంచిన అతని స్నేహితులు ఇన్‌స్టాలో రీల్‌ కోసం దానిని వీడియో తీయడం ప్రారంభించారు. 
 
ఇక వీడియో తీయడం ముగిసిన వెంట‌నే పగలబడి నవ్వుతూ ముకేశ్‌ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దాంతో అప్ప‌టివ‌ర‌కు నిజంగా యువ‌కుడు చ‌నిపోయాడ‌ని న‌మ్మిన అక్క‌డివారు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.  
 
కాగా, ఈ ఘ‌ట‌న కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో అప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ వీడియోపై ఫైర్ అవుతున్నారు. 
 
అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ రాజేష్ భారతి మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లోని రాజ్ కోల్డ్ స్టోరేజీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింద‌ని తెలిపారు. ఓ వ్యక్తి శ‌వంలా రోడ్డుపై పడుకుని వీడియో తీశాడు. అలా తన వీడియో ద్వారా అక్క‌డ కొంత‌సేప‌టి వ‌ర‌కు గంద‌ర‌గోళం సృష్టించాడు. దీనికి కార‌ణ‌మైన‌ ముఖేశ్‌ కుమార్‌ను అరెస్ట్ చేయ‌డం జ‌రిగింది. అత‌నిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments