Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో మరో ఘోరం.. పొలాల్లో ముక్కలు ముక్కలుగా బాలిక మృతదేహం!

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (10:06 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. హత్రాస్ ఘటన మరిచిపోకముందే ఇద్దరు మహిళ అత్యాచారానికి గురయ్యారు. తాజాగా మరో బాలిక అత్యాచారానికి గురైంది. పైగా, ఈ బాలికను హత్య చేసి, ముక్కలు ముక్కలు చేసి పంట పొలాల్లో పడేశారు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 26వ తేదీన ఓ బాలిక కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఈ బాలిక పొలాల్లో ముక్కలుగా నరికిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. 
 
విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బాలిక మృతదేహం భాగాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, ఈ ఘోరానికి పాల్పడింది బాలిక బంధువులేనని అనుమానిస్తూ, వారిని అరెస్ట్ చేశామని కాన్పూర్ దేహత్ జిల్లా ఎస్పీ కేకే చౌదరి వెల్లడించారు.
 
తమ బిడ్డపై అత్యాచారం చేసి, హత్య చేశారని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు. కాగా, తమ భూమిపై వివాదాలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే తన బిడ్డపై హత్యాచారం చేశారని బాధితురాలి తండ్రి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసును విచారిస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments