Webdunia - Bharat's app for daily news and videos

Install App

నత్తి పోయేందుకు ఆపరేషన్ చేయమంటే.. సున్తీకి శస్త్రచికిత్స చేశారు..

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (13:34 IST)
సాధారణంగా కొందరు వైద్యులు తమ విధుల్లో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారు చేయాల్సిన ఆపరేషన్ కాకుండా మరో ఆపరేషన్ చేస్తుంటారు. తాజాగా అలాంటి విచిత్ర ఆపరేషన్ ఒకటి జరిగింది. నత్తి పోయేందుకు ఆపరేషన్ చేయమంటే.. సున్తీ ఆపరేషన్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. రెండున్నరేళ్ల చిన్నారికి ఒక సమస్యకు బదులు మరో సమస్యకు చికిత్స చేశారు. 
 
జిల్లా ముఖ్య వైద్యాధికారి వెల్లడించిన వివరాల మేరకు.. ఓ కుటుంబ సభ్యులు తమ రెండున్నరేళ్ళ కుమారుడికి నత్తి సమస్యను పరిష్కరించే నిమిత్తం ఖాన్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అక్కడ నాలుక సర్జరీ చేయించుకునేలా ప్లాన్ చేశారు. కానీ, వైద్యులు నాలుకకు చికిత్స చేయకుండా కుమారుడికి సున్తీ ఆపరేషన్ చేశారని సదరు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఈ విషయం వెలుగులోకి రాగానే ముగ్గురు సభ్యుల వైద్య బృందాన్ని పంపించి విచారణ జరిపిస్తున్నామని, ఈ ఆరోపణల్లో నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై యూపీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి బ్రషేష్ పాఠక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు రూఢీ అయితే ఆపరేషన్ చేసిన వైద్యులతో పాటు హాస్పిటల్‌కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. అలాగే ఆస్పత్రి గుర్తింపు కూడా రద్దు చేస్తామని తెలిపారు. ఈ వ్యవహారంపై 24 గంటల్లో జిల్లా వైద్యాశాఖ అధికారికి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments