Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్ గాంధీ ఊరట

వరుణ్
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (19:07 IST)
కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో హాజరయ్యేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సుల్తాన్‌పూర్ జిల్లా సివిల్ కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో ఆయనకు ఊరట లభించింది. కాగా, గత 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కొనసాగుతున్న కేసులో రాహుల్ గాంధీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. 
 
ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. రాహుల్ గాంధీ కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రను మంగళవారం ఉదయం కొద్దిసేపు నిలిపివేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అమేథీలోని ఫుర్సత్‌ గంజ్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.
 
బెంగళూరులో 2018 విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై "అభ్యంతకరమైన" వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2018లో బీజేపీ నేత విజయ్ మిశ్రా రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హయాంలో జరిగిన హత్య కేసులో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.
 
రాహుల్ గాంధీకి జారీ చేసిన సమన్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర పట్టాలు తప్పదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇలాంటి వాటికి రాహుల్ గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ బెదిరిపోదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూర్ వెళ్లి చనిపోయాక వైజాగ్ లో ఏం జరిగింది?

సమంత షాకింగ్ లుక్, ఏంటి బ్రో ఇలా అయ్యింది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments