Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీ లియోన్ పేరుతో హాల్‌టిక్కెట్!!! ఎక్కడ?

Advertiesment
sunny leone

వరుణ్

, ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (11:28 IST)
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన వివిధ రకాల పోటీ పరీక్షలను నిర్లక్షపూరితంగా నిర్వహిస్తున్నాయి. ఫలితంగా అభ్యర్థుల పేర్లు తారుమారవుతున్నాయి ఫోటోలు మారిపోతున్నాయి. తాజాగా బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో పోటీ పరీక్షలకు హాల్ ‌టిక్కెట్ జారీ అయింది. ఈ వింత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీచేసిన ఈ అడ్మిట్ కార్డులో కనిపించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (యూపీ పీఆర్బీ) ఇటీవల కొత్త పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసి, రాత పరీక్ష కోసం హాల్ టిక్కెట్లను జారీచేసింది. వీటిలో ఒక అడ్మిట్ కార్డును బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో జారీ అయింది. ఈ కార్డుపై ఆమె పేరు, ఫోటో వివరాలను ముద్రించివున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 17వ తేదీన రాతపరీక్ష ఉందని పేర్కొన్నారు. 
 
కాగా, యూపీ పీఆర్బీ వెబ్‌సైట్‌లో సన్నీ లియోన్ ఫోటోతో రిజిస్ట్రేషన్ చేశారు. అడ్మిట్ కార్డు ప్రకారం సన్నీ లియోన్ పరీక్షా కేంద్రం కన్నౌజ్ జిల్లాలోని తిర్వా తహసిల్‌లో ఉన్న సొనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజీలో ఉంది. ఈ ఘటనపై కన్నౌజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది. కాగా, యూపీలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 75 జిల్లాల్లో 2385 పరీక్షా కేంద్రాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షను నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం - హానికారక పదార్థాలు..