Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం - హానికారక పదార్థాలు..

cotton candy

వరుణ్

, ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (10:45 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ తరహా నిర్ణయం పక్కనే ఉన్న పాండిచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. తాజాగా తమిళనాడు రాష్ట్రం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు చెన్నైలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో రోడమైన్ బి అనే రసాయనం అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించారు. కృత్రిమ రంగు కోసం పీచు మిఠాయితో దీనిని వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ రసాయనాన్ని ఇండస్ట్రియల్ డైగా పిలుస్తారు. బట్టల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లలో దీన్ని అధికంగా వినియోగిస్తుంటారు. 
 
ఫుడ్ కలర్ కోసం ఉపయోంచే అవకాశమే లేదు. ఎందుకంటే దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలింది. ఈ రసాయనం శరీరంలోకి వెళితే కిడ్నీలు, లివర్‌లపై ప్రభావం చూపుతుందని, అల్సర్‌‍తో పాటు కేన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు గుర్తించారు. ఈ క్రమంలో పీచు మిఠాయిలలో దీనిని ఉపయోగిస్తున్నందున వీటి అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. పీచు మిఠాయి తయారీలో ఉపయోగించే రంగుల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని అందువల్ల వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును బాంబుతో పేల్చివేస్తా!!