Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురిని పెళ్లాడిన తల్లి.. కుమార్తెపై 45 రోజుల పాటు లైంగిక దాడి.. చివరికి?

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (13:19 IST)
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మీరట్‌ జిల్లాలో ఓ బాలిక(15)ను నిర్బంధించి నెలరోజుల పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలోని సర్ధానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కంకేర్‌ ఖేరా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

మైనర్‌ బాలికను విక్రయించేందుకూ నిందితుడు సిద్ధమయ్యాడు. బాధితురాలు నిందితుడి చెర నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది. 
 
ఈ కేసులో ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 28న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..  బాధితురాలి తల్లికి మూడు పెండ్లిండ్లు జరిగాయి. తనకు మాయమాటలు చెప్పి తల్లి తనను బయటకు తీసుకువెళ్లిందని అక్కడ ఇద్దరు యువకులు తనకు మత్తుపదార్ధాలు ఇచ్చి వారి ఇండ్లకు తీసుకువెళ్లారని బాధితురాలు తెలిపింది. 
 
నిందితులు 45 రోజుల పాటు తనపై వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారని వెల్లడించింది. ఇక మార్చి 13న వారి చెర నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించింది. మరుసటి రోజు పోలీసులు ఆమె తల్లితో పాటు ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
బాధిత బాలిక తల్లి తొలుత రధ్నా గ్రామానికి చెందిన వ్యక్తిని పెండ్లి చేసుకుందని, ఆపై ఆర్మీలో పనిచేసే వ్యక్తితో రెండో పెండ్లి చేసుకోగా వారికి ఐదుగురు సంతానం కలిగారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రెండో భర్త మరణానంతరం ఆమె మూడోసారి పెండ్లి చేసుకుని ప్రస్తుతం కంకేర్‌ ఖేరాలో నివసిస్తోంది. నిందితులు ఇద్దరూ తరచూ మహిళ ఇంటికి వస్తుండేవారని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం