Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:26 IST)
కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేను చెంప దెబ్బ కొట్టేవాడిన‌ని చేసిన వ్యాఖ్య‌ల‌పై కేసు నమోదు చేసిన పోలీసులు... మంగళవారం అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇప్ప‌టికే కేంద్ర‌మంత్రి ఉన్న సంగ‌మేశ్వ‌ర్‌కు వెళ్లిన పోలీసుల బృందం.. అరెస్ట్ ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తోంది. అరెస్ట్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి ముందస్తు బెయిల్ కోసం ర‌త్న‌గిరి కోర్టు, బాంబే హైకోర్టుల‌కు వెళ్లిన నారాయ‌ణ్ రాణెకు రెండు చోట్లా చుక్కెదురైంది. త‌న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై అత్య‌వ‌స‌రంగా విచారించాల‌న్న పిటిష‌న్‌ను బాంబే హైకోర్టు తిర‌స్క‌రించింది. 
 
దేశానికి ఏ ఏడాది స్వాతంత్ర్యం వ‌చ్చిందో తెలియ‌ని ఉద్ధ‌వ్ థాక్రేను తాను చెంప దెబ్బ కొట్టేవాడిన‌ని సోమ‌వారం ఓ ర్యాలీలో అన్నారు కేంద్ర మంత్రి నారాయ‌ణ్ రాణె. దీనిపై శివ‌సేన తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల‌లో ఆయ‌న‌పై ఫిర్యాదులు చేసింది. బీజేపీ కార్యాల‌యాల‌పై శివ‌సేన కార్య‌క‌ర్త‌లు దాడులు కూడా చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments