Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అబ్దుల్ అజీజ్...

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:08 IST)
మేయ‌ర్ ప‌ద‌వి ఇచ్చినా కృత‌జ్ణ్న‌త లేకుండా టీడీపీలో చేరిన  అబ్దుల్ అజీజ్ అవినీతి బ్రాండ్ అంబాసిడ‌ర్ అని నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విమ‌ర్శించారు. జిల్లా కార్యాలయంలో మంగ‌ళ‌వారం విలేకరుల సమావేశంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన నాయకులు సయ్యద్ హంజా హుస్సేన్, సయ్యద్ సమీ హుస్సేన్ పాల్గొన్నారు. 
 
హాంజా హుస్సేన్ మాట్లాడుతూ, ముస్లింలు విశ్వాసానికి మారుపేర‌ని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  అజీజ్ కు మేయర్ పదవి కట్టబెట్టింద‌న్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని నమ్మించడానికి అబ్దుల్ అజీజ్ ఖురాన్ మీద ప్రమాణం చేశాడ‌ని, త‌ర్వాత మాట తప్పి తెలుగుదేశంలో చేరిన అవకాశవాదులను ముస్లిం సమాజం క్షమించద‌న్నారు. 
 
ఖురాన్ మీద ప్రమాణం చేసి మాట తప్పిన అజీజ్, ఇపుడు పతివ్రతలాగా మాట్లాడుతున్నాడ‌ని, వక్ఫ్ బోర్డు స్థలాన్ని డిమార్ట్ కి కేటాయించి, ముస్లింలకు ద్రోహం చేసిన వ్యక్తి అజీజ్ కాదా అని ప్ర‌శ్నించారు. పవిత్ర ముస్లింలు ప్రార్ధన చేసుకునే మసీదులను కూలగొట్టిన పాపం అజీజ్ దే అని, కాంట్రాక్టర్ల దగ్గర చిల్లర దండుకొని, అత్యంత అవినీతిపరుడిగా పేరుగాంచార‌ని విమ‌ర్శించారు. 
అజీజ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం అంటే, అన్నం పెట్టిన చేతులను నరకడమేన‌న్నారు. కార్పొరేటర్ స్థాయి లేని అజీజ్ ని మేయర్ పీఠం మీద కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి పైనే విమర్శలు చేయడం అన్యాయమ‌న్నారు. 
 
మేయర్ గా అత్యంత అవినీతికి పాల్పడి కమీషన్లు దండుకున్న నీచ చరిత్ర నీది... అత్యంత అవినీతిపరుడైన అజీజ్.. తాను ఏదో నీతిమంతునిగా మాట్లాడటం నెల్లూరు ప్రజలు సహించలేకపోతున్నార‌న్నారు. అజీజ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం అని ముస్లిం నేత‌లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments