Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - రాజమౌళిలతో భేటీకానున్న హోం మంత్రి అమిత్ షా

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (17:34 IST)
స్టార్ హీరో ప్రభాస్, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీకానున్నారనే వార్తలు వస్తున్నాయి. అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో భాగంగా నాలుగు రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కావాలని భావిస్తున్నారు. మహాజన్ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇందుకోసం ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుని, ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. 
 
ఆ సమయంలో దర్శకుడు రాజమౌళి, సినీనటుడు ప్రభాస్‌లతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు సమాజంలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులను అమిత్‌షా కలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్, నితిన్, మిథాలీ రాజ్ తదితరులను కలిశారు. 
 
అలాగే, ఇప్పుడు ప్రభాస్, రాజమౌళిలను కలవనున్నట్లు సమాచారం. జూన్‌ 16న 'ఆది పురుష్‌' విడుదలకానున్న నేపథ్యంలో ప్రభాస్‌ను అమిత్‌షా భేటా కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ భేటీపై అటు ప్రభాస్‌-రాజమౌళి, ఇటు భాజపా వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments