Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదిపురుష్ నుంచి తాజా అప్డేట్... "శివోహం" పాట రిలీజ్

Shivoham
, శనివారం, 10 జూన్ 2023 (14:50 IST)
Shivoham
ఆదిపురుష్ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ప్రభాస్ కెరీర్‌లో తొలి పౌరాణిక చిత్రంగా ఆదిపురుష్ తెరకెక్కుతోంది. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 
 
తాజాగా ఈ సినిమా నుంచి "శివోహం" అనే పాటను రిలీజ్ చేశారు. 'మహా ఫాల నేత్ర.. అంటూ ఈ పాట సాగుతోంది. కథాపరంగా శివుడిని పూజిస్తూ రావణాసురుడు ఆలపించే పాట ఇదని తెలుస్తోంది.  
 
భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఓమ్ రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 'రామయణం'లోని 'అరణ్యకాండ', 'యుద్ధకాండ'లోని కథను ప్రధానంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. 
 
శ్రీరాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్ నటించిన ఈ సినిమాలో, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడుగా దేవ్ దత్ నటించారు. తాజాగా విడుదలైన శివోహం పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘భగవంత్ కేసరి’ గ్రాండ్ టీజర్ లాంచ్.. బాలయ్య పుట్టినరోజు బిగ్ ట్రీట్