Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్రం

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (08:18 IST)
రెండు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అలాగే, ఇతర రాష్ట్రాలకు కూడా మంజూరు చేసింది. ఈ పన్నుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20,928 కోట్లు కేటాయించింది. అత్యల్పంగా గోవాకు రూ.450.32 కోట్లను విడుదల చేసింది. 
 
రాష్ట్రాలకు కేటాయించాల్సిన పన్నుల వాటా మొత్తం రూ.1,16,665.75 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడివున్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటే విడుదల నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రటనలో తెలిపింది. 
 
రాష్ట్రాలకు విడుదలైన పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.20928 కోట్లను విడుదల చేయగా, ఆ తర్వాతి స్థానంలో బిహార్ రాష్ట్రానికి రూ.11734 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.4721 కోట్లు, తెలంగాణాకు రూ.2452 కోట్లు చొప్పున విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments