Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిని ట్రాప్ చేసి ముగ్గులో దింపిన మామ, బెడ్ పైన అసభ్యకర రీతిలో చూసిన భర్త

Webdunia
సోమవారం, 27 జులై 2020 (22:23 IST)
కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు వావివరసలు మర్చిపోయి సంబంధాలు పెట్టేసుకుంటున్నారు. తండ్రితో సమానంగా భావించాల్సిన మామతో ఒక కోడలు అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి హెచ్చరించినా పట్టించుకోలేదు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
 
తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పెన్నగరం పరిధిలోని ఎంకే నగర్‌కి చెందిన మునియప్పన్‌కి ఆరుగురు కొడుకులు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మునియప్పన్ భార్య కొంతకాలం క్రితమే చనిపోయింది. దీంతో ఒంటరిగా ఉంటున్నాడు. తాను నివాసముంటున్న ప్రాంతానికి దగ్గరలోనే నాలుగో కుమారుడు ఉంటున్నాడు. 
 
ఎవరూ అందుబాటులో లేకపోవడం.. నాలుగో కుమారుడు మాత్రమే పక్కనే ఉండటంతో అప్పుడప్పుడు భోజనం తినేందుకు వారికి ఇంటికి వెళ్ళేవాడు. కూతురితో సమానంగా భావించాల్సిన కోడలిపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. లోబరుచుకున్నాడు. ఈ తంతు గత రెండునెలల నుంచి సాగుతోంది.
 
మునియప్పన్ కొడుకుకి స్థానికుల ద్వారా ఆ విషయం తెలిసింది. భార్యను హెచ్చరించాడు. తండ్రిని పద్ధతి మార్చుకోమన్నాడు. అయినా వారు మారలేదు. మద్యం మత్తులో నిన్న రాత్రి ఇంటికి వెళ్ళాడు. భోజనం తినేందుకు వెళ్ళిన మునియప్పన్ కోడలితో రాసలీలల్లో ఉన్నాడు.
 
దీంతో తట్టుకోలేని కొడుకు ఇంట్లో ఉన్న కత్తితో తండ్రిని నరికేశాడు. భార్యపై దాడి చేసే లోపే ఆమె భయపడి పారిపోయింది. నిందితుడు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. ఈ హత్య కాస్త స్థానికంగా తీవ్ర సంచలనంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments