Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఒత్తిడిని భరించలేని ఇంజనీర్ ... మెట్ల రెయిలింగ్‌కు ఉరేసుకుని...

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (15:19 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. పని ఒత్తిడిని భరించలేని ఓ ఎలక్ట్రిక్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో వెలుగుచూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సూరత్ పట్టణానికి చెందిన జిగార్ గాంధీ అనే వ్యక్తి నోయిడాకు చెందిన ఓ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల ఇంటికి తిరిగివచ్చిన జిగార్ వర్కు ఫ్రం హోం చేస్తూ పని చేయసాగాడు. 
 
ఈ క్రమంలో పని ఒత్తిడిని తట్టుకోలేక మెట్ల రెయిలింగు వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు జిగార్ గాంధీకి డిసెంబరులో నిశ్చితార్థం తేదీ నిర్ణయించామని, ఈలోగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెప్పారు. 
 
నిందితుడుని అరెస్టు చేయలేదనీ..  
ఇదిలావుంటే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలోని బసంత్ నగర్‌లో లైంగికదాడికి గురైన ఓ మైనర్ బాలిక విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు. 
 
దీంతో ఆవేదన చెందిన మైనర్ బాలిక విషం తాగింది. విషం తాగిన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు. కాగా బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించామని బలరాంపూర్ ఏఎస్పీ ప్రశాంత్ చెప్పారు. బాలిక ఆసుపత్రిలో కోలుకుంటుందని ఈ కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments