Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి కాలేజీలను ప్రారంభించాలి

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (16:28 IST)
కరోనా మహమ్మారి కారణంగా కొత్త విద్యా సంవత్సరాన్ని ఎప్పటిలా జూలై నుంచి కాకుండా సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ ప్ర‌తిపాద‌న‌లు చేసింది. కరోనా కారణంగా మార్చి నెల నుంచే కాలేజీలు, సూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. తాజాగా కోవిడ్‌19 నేప‌థ్యంలో కాలేజీల అంశాన్ని స్ట‌డీ చేసేందుకు యూజీసీ రెండు క‌మిటీల‌ను వేసింది. 
 
విద్యా సంవ‌త్స‌రం న‌ష్టంతో పాటు ఆన్‌లైన్ విద్య గురించి ఆ క‌మిటీలు స్ట‌డీ చేశాయి. హ‌ర్యానా వ‌ర్సిటీ వీసీ ఆర్‌సీ కుహ‌ద్ నేతృత్వంలో ఓ క‌మిటీ వ‌ర్స‌టీ ప‌రీక్ష‌ల గురించి అధ్య‌య‌నం చేసింది. 
 
ఇగ్నో వీసీ నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో మ‌రో క‌మిటీ ఆన్‌లైన్ ప‌రీక్ష‌ల గురించి రిపోర్ట్ త‌యారు చేసింది. అయితే రెండు క‌మిటీలు శుక్ర‌వారం యూజీసీకి నివేదిక‌లు అందించాయి. దాంట్లో ఓ క‌మిటీ.. అకాడ‌మిక్ సంవ‌త్స‌రాన్ని జూలైకి బ‌దులుగా సెప్టెంబ‌ర్ నుంచి స్టార్ట్ చేయాల‌ని సూచించింది. 
 
ఒక‌వేళ వ‌ర్సిటీల్లో కావాల్సినంత మౌళిక స‌దుపాయాలు ఉంటే, వారు ఆన్‌లైన్ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌వ‌చ్చు అని మ‌రో క‌మిటీ సూచించింది. మాన‌వ‌వ‌న‌రుల మంత్రిత్వ‌శాఖ ఆ రెండు క‌మిటీ నివేదిక‌ల‌ను ప‌రిశీలిస్తున్న‌ది. మ‌రో వారం రోజుల్లోగా దీనిపై ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తుందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments