Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ఫ్రెండ్... బైకుపై ఎక్కమనగానే ఎక్కేసింది... నాలుగు రోజులపాటు అత్యాచారం...

సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో ఎన్ని లాభాలు వున్నాయో అన్ని నష్టాలు వున్నాయన్నది తెలిసిన విషయమే. ముఖ్యంగా ఫేస్‌బుక్ స్నేహం కారణంగా చాలామంది అమ్మాయిలు మోసపోతున్న ఘటనలు చాలా చూస్తున్నాం. తాజాగా జైపూర్‌లో ఇలా

Webdunia
మంగళవారం, 1 మే 2018 (13:34 IST)
సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో ఎన్ని లాభాలు వున్నాయో అన్ని నష్టాలు వున్నాయన్నది తెలిసిన విషయమే. ముఖ్యంగా ఫేస్‌బుక్ స్నేహం కారణంగా చాలామంది అమ్మాయిలు మోసపోతున్న ఘటనలు చాలా చూస్తున్నాం. తాజాగా జైపూర్‌లో ఇలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో ఓ యువతితో పరిచయమైన యువకుడు తన కామ కోర్కెను తీర్చుకున్న ఘటన వెలుగుచూసింది.
 
వివరాల్లోకి వెళితే.... 16 ఏళ్ల బాలిక రాజస్థాన్ కోటా సిటీలో 11వ తరగతి చదువుతోంది. ఈమెకు పంకజ్ ధోబీ అనే 22 ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాకుంటూ వుండేవారు. ఏప్రిల్ 24న బాలిక స్కూల్‌కు వెళ్తున్న సమయంలో మధ్యలో అతడు మోటారు సైకిలుపై వచ్చి డ్రాప్ చేస్తాను ఎక్కు అంటూ తన బైకుపై ఎక్కించుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆమెను స్కూలుకి కాకుండా నేరుగా అతడి గదికి తీసుకెళ్లాడు. గదికి ఎందుకు అని ప్రశ్నిస్తే... జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకుని వెళదామని చెప్పి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. అతడు రాగానే ఇద్దరూ కలిసి ఆమెను తాళ్లతో బంధించి అత్యాచారం చేశారు. నాలుగు రోజులుగా కామాంధులు తమ కోర్కెను తీర్చుకున్నారు. శనివారం నాడు ఆమె ఎలాగో తప్పించుకుని ఇంటికి చేరి విషయాన్ని పెద్దలకు తెలిపింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందులను పోలీసులు అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments