గుజరాత్‌లో బీజేపీ విజయానికి కారణమిదే...

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాన కారణం బుల్లెట్ రైలు ప్రాజెక్టు. దేశంలో ఎన్నో మెట్రో నగరాలు ఉన్నప్పటికీ, వాటినన్నింటినీ పక్కనబెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మ

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (10:15 IST)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాన కారణం బుల్లెట్ రైలు ప్రాజెక్టు. దేశంలో ఎన్నో మెట్రో నగరాలు ఉన్నప్పటికీ, వాటినన్నింటినీ పక్కనబెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌ను ఎంచుకున్నారు. ఇది బీజేపీకి బాగా కలిసివచ్చింది. 
 
సాధారణంగా ఏ ప్రభుత్వంపైన అయినా ఐదేళ్ల తర్వాత కొంత ప్రజా వ్యతిరేకత ఉంటుంది. అయితే గుజరాత్‌లో కూడా అలాంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ రెండు అంశాలతో అది దూరమైంది. ఫలితంగా బీజేపీ ఆరోసారి విజయకేతనం ఎగురవేసింది. దీనికి కారణం రెండు అంశాలు బాగా ప్రభావితం చేశాయనీ రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. 
 
అందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోడీ తమ రాష్ట్రవ్యక్తి కావడం. రెండోది బుల్లెట్ రైలు ప్రాజెక్టు. దేశంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాలున్నా బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు మోడీ గుజరాత్‌ను ఎంచుకున్నారు. గుజరాత్ ప్రజలు తమ వాణిజ్య అవసరాల కోసం ఎక్కువగా వాణిజ్య రాజధాని ముంబైకి వెళ్తుంటారు. దీనిని సరిగ్గా గుర్తించిన మోడీ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఓకే చెప్పారు.
 
లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుకు మోడీ ఇటీవలే జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రాన్ని మోడీ పట్టించుకోవడం లేదన్న అపోహలను ఈ ప్రాజెక్టు తుడిపేసింది. అలాగే ఇక్కడ బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ‘నీచ్’ వ్యాఖ్యలు కూడా ఓ కారణంగా నిలిచాయని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments