Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు.. ఇద్దరూ మగాళ్లే.. ప్రేమ-పెళ్లి ఆపై మృతి.. చివరికి బిడ్డ..?

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (09:26 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల సంసారానికి తర్వాత ఉన్నట్టుండి భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. అది కాస్త వీరి ప్రాణాలను బలి తీసుకుంది. ఆ తర్వాతే షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. మరణించిన భార్యభర్తల్లో.. భార్య కూడా మగాడేనట. ఇది తెలిసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
 
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని చిన్న పట్టణమైన సెహోర్‌‌కు చెందిన ఓ జంట 2012లో వివాహం చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత ఓ బిడ్డను దత్తత తీసుకుని సంసార జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య వివాదం రేగింది. దాంతో భార్య చీరకు నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కాపాడే క్రమంలో భర్తకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలతో భార్య చనిపోయింది.
 
ఆ తర్వాత నాలుగు రోజులకి భర్త కూడా చనిపోయాడు. భార్య శవపరీక్ష నివేదికను పోలీసులు గత వారం అందుకున్నారు. ఈ పరీక్షలో ఆమె స్త్రీ కాదు పురుషుడని ఇచ్చారు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. అసలు విషయంపై ఆరా తీశారు. ఆ మహిళ సోదరుడు పోలీసులకు పూర్తి విషయం చెప్పేశాడు.
 
వాస్తవానికి ఆ ఇద్దరు స్వలింగ సంపర్కులని, తమ వివాహాన్ని సమాజం అంగీకరించదనే ఉద్దేశంతో ఒకరు మహిళగా రూపం మార్చుకుని భార్యాభర్తల్లా జీవించడం మొదలు పెట్టారని తెలిపింది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఆమెను భార్యగానే చూసేవారు. చివరికి.. పోస్ట్‌మార్టం రిపోర్టుతో అసలు విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments