గురువారం పూట ఎలాంటి పూజలు చేస్తే శుభ ఫలితాలు చేకూరుతాయో.. ఈ కథనం ద్వారా తెలుసుకోవచ్చు. గురువారం పూట నవగ్రహాల్లో ముఖ్యమైన గురువును పూజించడం ద్వారా జాతకంలో గురు దోషాలు తొలగిపోతాయి. గురు గ్రహం శుభకారకం. శుభకార్యాలను నిర్వహించేందుకు ముందుగా గురు భగవానుడి దశను గుర్తించాకే ఆ పనిని మొదలెడతారు.
ప్రతి వివాహం జరగాలంటే గురువు అనుగ్రహం తప్పక వుండి తీరాలి. గురువు గురువారానికి అధిపతి. అలాంటి గురువారం పూట గురువుకు నేతి దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. గురువారం గురువును తలచి వ్రతం ఆచరించవచ్చు. జాజి పువ్వులను సమర్పించవచ్చు. పసుపు రంగు దుస్తులు ధరించి.. పసుపు రంగు పుష్పాలను స్వామికి సమర్పించవచ్చు. గురు శ్లోకాలను పఠించి ఆయన అనుగ్రహం పొందవచ్చు.
ఇంకా గురువారం పూట.. శివునికి పసుపు రంగు లడ్డూలను సమర్పించవచ్చు. ఇలా చేస్తే అదృష్టం చేకూరుతుంది. గురువారాల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. స్నానమాచరించి.. దీపమెలిగించి విష్ణుమూర్తిని పూజించేవారికి.. ఆ రోజున పసుపు రంగు వస్త్రాలను దానం చేసే వారికి సిరిసంపదలు చేకూరుతాయి.
గురువారాల్లో "ఓం నమో నారాయణాయ:'' అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇలా చేయడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. సిరిసంపదలు, సుఖసంతోషాలు, అదృష్టం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.