మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే అప్పు తీసుకున్నట్లైతే అది అనేక బాధలకు కారణమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే మంగళవారం రుణాలు ఇవ్వడం.. తీసుకోవడం కూడదు. కానీ విద్య, వైద్యపరమైన, దైవ కార్యాలకు సంబంధించిన రుణాలకు ఇది వర్తించదు.
అలాగే మంగళవారం పూట కొత్త దుస్తులు ధరించకూడదు. తలంటు స్నానం చేసుకోకూడదు. ముఖ్యమైన ప్రయాణాలు చేయాల్సి వస్తే భగవంతునిని ధ్యానించి.. కుమార స్వామిని స్తుతించుకుని ప్రయాణం సాగించారు.
మంగళవారం ఉపవాసం చేసేవారు రాత్రిపూట ఉప్పు చేర్చిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మంగళవారం పూట గోళ్ళు కత్తిరించడం, క్షవరం చేయడం కూడదు. కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. అందుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.