Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండాకులు మీవి కావు... శశికళ-దినకరన్‌లకు షాక్...

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:36 IST)
తమిళనాడులో జయలలిత మరణం తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయి. ఎవరికి తోచినట్లు వారు గ్రూపులను ఏర్పాటు చేసుకుని పార్టీని, అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. శశికళ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోగా, పళని స్వామి మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుండి పార్టీ తమదంటే తమదంటూ కోర్టుకు వెళ్లారు.
 
తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. అన్నాడీఎమ్‌‌కేకు చెందిన రెండాకుల గుర్తు, పార్టీ పేరు ముఖ్యమంత్రి పళని స్వామి వర్గానికే చెందుతుందని తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో శశికళ, టీటీవీ దినకరన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017 నవంబర్‌లో ఎన్నికల కమీషన్ పార్టీ పేరును, గుర్తును పళని స్వామికే కేటాయించింది. అయితే పార్టీ తమదంటూ టీటీవీ దినకరన్ కోర్టుకు వెళ్లారు.
 
జస్టిస్ జీ.ఎస్. సిస్థానీ, జస్టిస్ సంగీత దింగ్రా సెహగల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో పార్టీపై వారికి ఎటువంటి హక్కు లేదని తేలిపోయింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments