Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గిన ట్విట్టర్

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (08:33 IST)
ట్విట్టర్ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. భారత మ్యాపును తప్పుగా చూపిస్తూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ఈ సామాజిక మాధ్యమం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ప్రభుత్వం సహా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం కావడంతో మ్యాపును వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది.
 
జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌‌లను భారత్‌ వెలుపల ప్రాంతాలుగా చూపుతూ ట్విట్టర్‌ తన వెబ్‌సైట్లో ట్వీప్‌ లైఫ్‌ అనే సెక్షన్‌లో తప్పుడు మ్యాపును ఉంచింది. దీంతో ట్విట్టర్‌పై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.
 
దేశ మ్యాపును తప్పుగా చూపించడం చట్టరీత్యా నేరమని.. దీనికి భారీ జరిమానాతో పాటు దేశంలోని సంస్థ అధికారులు జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలోనూ ఈ తరహా తప్పిదాలకు పాల్పడిన ట్విట్టర్‌ను ఈసారి గట్టిగానే హెచ్చరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments