భార్యాపిల్లలను చంపేశాడు.. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు డ్రామా చేశాడు..

సెల్వి
సోమవారం, 15 జులై 2024 (10:15 IST)
వివాహేతర సంబంధం కారణంగా భార్యాపిల్లలను చంపేశాడు... ఓ భర్త. ఈ వ్యవహారంలో భర్తే నిందితుడని పోలీసులు 48 రోజుల్లో కనిపెట్టారు. అక్రమ సంబంధం పెట్టుకొని భార్య, పిల్లలను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. 
 
ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం - రఘునాథపాలెం మండలం బాబోజీ తండకు చెందిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఒక ఆస్పత్రిలో పిజియోతెరపిస్టుగా పని చేస్తూ అదే ఆస్పత్రిలో పని చేస్తున్న సోని ప్రాన్సిస్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
 
సోని ప్రాన్సిస్‌తో కలిసి ఉండాలని తన భార్య, ఇద్దరు పిల్లల అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. కారులో గ్రామానికి వెళ్తుండగా, పోస్టుమార్టంలో ఎంత మోతాదులో పాయిజన్ డోస్ ఇస్తే రాదో గూగుల్‌లో వెతికి తెలుసుకొని తన భార్యకు కారులో మత్తుమందు సూది ఇచ్చాడు. నాలుగేళ్ల లోపున్న ఇద్దరు అమ్మాయిలను గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి ముగ్గురిని చంపేశాడు.
 
ఆ తర్వాత కారును ఒక చెట్టుకు ఢీకొట్టి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. చనిపోయిన భార్య, పిల్లల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానంతో భార్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
దీనిపై విచారణ జరిపిన పోలీసులు కారులో ఒక ఇంజక్షన్, ప్రవీణ్ ఫోన్‌లో గూగుల్ హిస్టరీతో ప్రశ్నించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments