Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతు భరోసా పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తులు!!

Advertiesment
Rythu Bharosa

వరుణ్

, బుధవారం, 10 జులై 2024 (14:30 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసా నిధుల పంపిణీపై దృష్టిసారించింది. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుంది.  రైతు భరోసాను 5 ఎకరాలకు ఇవ్వాలా లేకా 10 ఎకరాల భూమి కలిగిన రైతులకు ఇవ్వాలా అనే అంశంపై తర్జనభర్జన పడుతుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో  రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. ఇందుకోసం గురువారం నుంచి ఉమ్మడి జిల్లాల్లో వరుసగా వర్క్ షాపులను నిర్వహించాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. 
 
ఈ వర్క్‌షాపులు 10వ తేదీన ఖమ్మం, 11న ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వం వర్క్‌షాపులు నిర్వహించనుంది. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
 
రైతులు, రైతు సంఘాల నుంచి సేకరించిన అభిప్రాయాలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఉపసంఘం చైర్మన్‌గా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఆయా జిల్లాల్లో అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు, ఇంఛార్జ్ మంత్రులు కూడా పాల్గొననున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధికారిక రికార్డుల్లో తన పేరు - లింగాన్ని మార్చుకు ఐఆర్ఎస్ అధికారి!!