Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధికారిక రికార్డుల్లో తన పేరు - లింగాన్ని మార్చుకు ఐఆర్ఎస్ అధికారి!!

anukathir surya

వరుణ్

, బుధవారం, 10 జులై 2024 (14:20 IST)
ఇండియన్ సివిల్ సర్వీసెస్(ఐపీఎస్) చరిత్రలో తొలిసారి ఒక ఆసక్తికరమైన పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) విభాగంలో పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి అన్ని అధికారిక రికార్డుల్లో తన పేరు, లింగాన్ని మార్చుకున్నారు. ఈ తరహాలో చరిత్రలో తొలిసారి వచ్చిన అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల ఎం.అనసూయ ఇప్పుడు ఎం.అనుకదిర్ సూర్యగా మారిపోయారు. ఇన్నాళ్లు స్త్రీగా ఉన్న అనుకతీర్‌ను ఇకపై పురుషుడిగా ప్రభుత్వం పరిగణించనుంది. అన్ని అధికారిక రికార్డుల్లోనూ అనుకతిర్ సూర్యగా గుర్తిస్తారు.
 
లింక్డ్‌ఇన్ లభ్యమైన ప్రొఫైల్ ప్రకారం.. సూర్య డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమీషనర్ ప్రమోషన్ పొందారు. గత యేడాది నుంచి హైదరాబాద్ నగరంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీలో 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలరాముని రథం కింద పడింది.. తొమ్మిది మందికి గాయాలు