Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీట్రాప్‌కు పెద్దాయన పడిపోయాడు.. రూ.82లక్షలు గోవిందా!

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (09:30 IST)
హనీట్రాప్‌కు ఓ పెద్దాయన మోసపోయాడు. కిలాడీ మహిళల మాటలు నమ్మి.. వారి వలపు వలలో చిక్కుకున్నాడు. చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. మా అబ్బాయి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడని.. వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం చేయాలంటూ 40 ఏళ్ల మహిళ  60 ఏళ్ల పెద్దాయనకు ఫోన్ చేసింది. 
 
వీరికి ముందుగానే కాస్త పరిచయం వుండటంతో మాటలు కలిశాయి. అడిగేసరికి కాదనలేక పెద్దాయనతో ఇచ్చేయడం చేశాడు. ఇలా ఎన్నోసార్లు 60 ఏళ్ల వ్యక్తి డబ్బు గుంజేసిన మహిళ.. తోడుకు ఆమె చెల్లెల్ని కూడా రంగంలోకి దించింది. 
 
ఈ క్రమంలో హోటల్‌లో రెండు, మూడుసార్లు కలిసి కాలం గడపడంతో అసలు సంగతి బయటపడింది. చెల్లి ఫోనులో వీడియోలు, ఫోటోలు తీశామని.. డబ్బులు ఇవ్వకపోతే.. రాసలీలల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. ఇలా బెదిరించి, సాయం పేరుతో రూ.82 లక్షలు గుంజారు. అంతేగాకుండా మరో రూ.40 లక్షలు కావాలంటూ ఒత్తిడి పెంచారు. 
 
ఆ సొమ్ము ఇవ్వకపోతే.. నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డావంటూ కేసు పెడతామని హెచ్చరించడంతో.. 60 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటక, బెంగళూరు, ఉత్తరహళ్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఇద్దరు మహిళల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments