Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో మహిళ పర్సను చోరీ చేసిన దొంగ... పట్టుకుని కిటికీకి వేలడాదీసిన ప్రయాణికులు

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:30 IST)
సాధారణంగా రద్దీగా ఉండే బస్సులు, రైళ్లలో జైబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల చేతికి చిక్కి దెబ్బలు తింటుంటారు. తాజాగా ఓ దొంగ రైలు ప్రయాణికురాలి వద్ద పర్సు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని రైలు కిటికీకి వేలడాదీశాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దొంగకు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
బిహార్ రాష్ట్రంలోని బెగూసరాయ్‌ జిల్లా పరిధిలో శనివారం కటిహార్‌ నుంచి సమస్తిపుర్‌ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సు చోరీకి గురైంది. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకేందుకు ప్రయత్నిస్తున్న దొంగను మిగతా ప్రయాణికులు గుర్తించారు. వెంటనే లోపలి నుంచి ఆ యువకుడి చేతులు గట్టిగా పట్టుకున్నారు. కొన్ని కిలోమీటర్లు అలాగే వేలాడుతూ ప్రయాణించాక.. బచ్వారా జంక్షనులో రైలు ఆగింది. 
 
ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు అతణ్ని అప్పగించారు. రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక విధంగా ఆ దొంగ ప్రాణాలను రైలు ప్రయాణికులు కాపాడారు. లేదంటే వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకివుంటే ఆ దొంగ ప్రాణాలు కోల్పోయేవాడని ప్రయాణికులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments