Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు - ఎల్లుండి భారత్ బంద్ - కార్మిక సంఘాల మద్దతు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (15:15 IST)
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తూ దేశంలోని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఈ నెల 28, 29వ తేదీల్లో భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ముఖ్యంగా, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆల్ ఇండియా బ్యాంకు ఉద్యోగుల సంఘం సమితి బ్యాంకింగ్ సెక్టార్‌లో సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ బంద్ నేపథ్యంలో ఖాతాదారులు ముందుగానే సంసిద్ధులై ఉండాలని కోరింది. 
 
అలాగే, లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందని పేర్కొంటూ కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు, రవాణా, కార్మిక, బ్యాంకు, బీమా, బొగ్గు, స్టీల్, చమురు, టెలికాం, పోస్టల్, ఆదాయపన్ను శాఖ, కాపర్ వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ సమ్మెకు నోటీసులు జారీచేశాయి. అయితే, రైల్వే, రక్షణ రంగాలకు చెందిన సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతునివ్వడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments