Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు కందిపప్పు వంతు.. పెరుగుతూ పోతున్న ధర

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (11:25 IST)
నిన్నామొన్నటి వరకు వంట నూనెలలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి పెరిగిపోయి తిరిగి కిందకు దిగుతున్నాయి. ఇపుడు కందిపప్పు వంతు వచ్చింది. ఏపీలో గత ఎనిమిది నెలల్లో కందిపప్పు ధర 55 శాతం ధర పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో రూ.160-170 మధ్య పలుకుతుండగా, బ్రాండెడ్ కందిపప్పును రూ.180కిపైనే విక్రయిస్తున్నారు. మున్ముందు ఈ ధర రూ.200 దాటే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు తగ్గిపోవడమే. 
 
ఈ యేడాది జనవరిలో కిలో కందిపప్పు ధర రూ.98 నుంచి రూ.110 వరకు ఉంది. ఆగస్టులో రూ.170కి చేరుకుంది. అంటే గత 8 నెలల్లో 55 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో గరిష్ఠంగా 8.50 లక్షల ఎకరాల్లో కందిపప్పు సాగుచేసేవారు. గతేడాది ఇది 6 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఈ పంట ద్వారా 1.09 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా, వర్షాల కారణంగా దిగుబడులు పడిపోయాయి.
 
మరోవైపు, ఈ ఏడాది కందిసాగు దారుణంగా పడిపోయింది. ఆగస్టు నెలాఖరు నాటికి 292 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. దేశవ్యాప్తంగానూ కంది సాగు గణనీయంగా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. 2018లో దేశంలో 43 లక్షల కందిపప్పు ఉత్పత్తి కాగా, ఈ ఏది ఇప్పటి వరకు 34 లక్షల టన్నులకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కందిపప్పును దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments