Webdunia - Bharat's app for daily news and videos

Install App

యేడాది కాలంలో కురవాల్సిన వర్షం ఒక్క రోజే కురిసింది : సీఎం స్టాలిన్

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (15:41 IST)
ఒక యేడాది కాలంలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రోజే కురిసిందని, అందుకే దక్షిణాదిలోని ఆ నాలుగు జిల్లాలు జలదిగ్బధంలో చిక్కుకున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తమిళనాడు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది జిల్లాలైన తిరునెల్వేలి, తూత్తుక్కుడి, కన్యాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఫలితంగా ఈ జిల్లాలపై జలఖడ్గం విరుచుకుపడింది. అతి భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో ఈ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. 
 
ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. హస్తినలో విలేకరులతో మాట్లాడుతూ ఒక యేడాదిలో కురవాల్సిన వర్షం ఒక్క రోజే కురిసిందని చెప్పారు. ఈ కారణంగానే ఆ నాలుగు జిల్లాలు నీట మునిగియాని చెప్పారు. 
 
"డిసెంబరు 17, 18 తేదీల్లో వాతావరణశాఖ అంచనా వేసిన దానికంటే భారీ వర్షాలు కురిశాయి. తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో గత 47-60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షం కురిసింది. ఒక్క కోవిల్‌పట్టిలో ఏకంగా 94 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు, 10 మంది ఐఏఎస్ అధికారులు, 10 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైవున్నారు. ఇప్పటివరకు దాదాపు 13 వేల మందిని శిబిరాలకు తరలించాం. హెలికాప్టర్ల ద్వారా నిర్వాసితులకు ఆహారం పంపిణీ చేస్తున్నాం. సైన్యం సాయం కూడా కోరాం" అని సీఎం స్టాలిన్‌ వివరించారు.
 
కాగా, ఇటీవల చెన్నై సహా నాలుగు జిల్లాలను మిచౌంగ్ తుఫాను కుదిపేసిన విషయం తెల్సిందే. "తుఫానుతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకునేందుకు శాశ్వత సాయంగా రూ.12,059 కోట్లు, మధ్యంతర సాయంగా మరో రూ.7,033 కోట్లు కోరాం. కేంద్ర నిధుల కోసం ఎదురుచూడకుండా నాలుగు జిల్లాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం అందించాం. కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు అందిస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టగలం" అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments