Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు నెలల పాటు 100కిలో మీటర్లు.. 4 నదులు దాటిన పులి

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (10:00 IST)
పశ్చిమ బెంగాల్‌లో అదృశ్యమైన ఓ పులి కొండలు, కోనలు దాటుకుంటూ నాలుగు నెలలపాటు వంద కిలోమీటర్లు ప్రయాణించి బంగ్లాదేశ్ చేరుకుంది. పులి తన ప్రయాణంలో నాలుగైదు నదులు, మూడు దీవులను దాటింది. అది తన ప్రయాణంలో ఎక్కడా జనావాసాల్లో చొరబడకపోవడం గమనార్హం. 
 
బెంగాల్ అడవుల నుంచి అదృశ్యమైన ఈ పులి ఆచూకీని దాని మెడకు అమర్చిన రేడియో ట్యాగింగ్ పరికరం ద్వారా అటవీ అధికారులు కనుగొన్నారు. సుందర్బన్ అడవుల్లో కనిపించిన ఈ పులికి గతేడాదే ఈ పరికరాన్ని అమర్చారు. ఇప్పుడు అదే దాని ఆచూకీని తెలిపింది. అలాగే, ఒకవేళ ఆ పులి కనుక మరణిస్తే ఆ విషయాన్ని తెలియజేసేందుకు కూడా ఓ సెన్సార్‌ను అమర్చారు.
 
బెంగాల్ అడవుల నుంచి బయలుదేరిన ఈ పులి బంగ్లాదేశ్‌ వైపుగా వెళ్తూ గత నెల 11న ఆ దేశంలోని తల్‌పాట్టి దీవికి చేరుకుంది. ఆ తర్వాత రేడియో ట్యాగింగ్ పరికరం పనిచేయడం మానేసింది. దీంతో దాని ఆచూకీ కనుగొనడం కష్టమైంది. 
 
తాజాగా, ఆ పులి బంగ్లాదేశ్‌లోని సుందర్బన్ అడవుల్లో ఉన్నట్టు గుర్తించారు. గతంలో అది అక్కడి నుంచే పశ్చిమ బెంగాల్ అడవుల్లోకి వచ్చి ఉంటుందని, ఇప్పుడు మళ్లీ అది సొంత ప్రాంతానికి చేరుకుని ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments