Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం బానిసల వింత ప్రవర్తన... ఆ రాష్ట్రంలో 10 మంది మృతి

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (08:59 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. బంద్ అయిన వాటిలో మద్యం కూడా ఉంది. దీంతో తాగుబోతులు మద్యంలేక వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా, పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అలా తమిళనాడు రాష్ట్రంలో మద్యంలేక ఏకంగా 10 మంది వరకు మృత్యువాతపడ్డారు. 
 
ఈ రాష్ట్రంలో అనేక మంది మద్యం బానిసలు ఇలాంటి బలవన్మరణాలకే పాల్పడుతున్నారు. కడలూరులో నాటుసారా తాగి ముగ్గురు మృతి చెందారు. అలాగే పెరంబలూరులో స్పిరిట్‌ తాగిన ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. మద్యం దొరకక ఇప్పటివరకు తమిళనాడులో 10 మంది మృతి చెందారు. 
 
అలాగే, కేరళ రాష్ట్రంలో కూడా మద్యం లేకపోవడంతో పలువురు ఆత్మహత్య చేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్యుడి సలహా మేరకు మద్యం విక్రయాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments