Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటేస్తే.. మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు.. అంతే ఆ ముగ్గురు?

ఆధునికత పెరిగిపోతున్నప్పటికీ మూఢనమ్మకాలను ప్రజలు గట్టిగా పట్టుకుని ఊగిసలాడుతున్నారు. తాజాగా ఆధునిక వైద్యం, చికిత్సలు ఎంత అందుబాటులోకి వచ్చినా మూఢనమ్మకంతో ముగ్గురు ప్రాణాలు బలైనాయి. వివరాల్లోకి వెళితే.

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (18:38 IST)
ఆధునికత పెరిగిపోతున్నప్పటికీ మూఢనమ్మకాలను ప్రజలు గట్టిగా పట్టుకుని ఊగిసలాడుతున్నారు. తాజాగా ఆధునిక వైద్యం, చికిత్సలు ఎంత అందుబాటులోకి వచ్చినా మూఢనమ్మకంతో ముగ్గురు ప్రాణాలు బలైనాయి. వివరాల్లోకి వెళితే.. మూఢ నమ్మకం కారణంగా బీహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 
 
బీహార్‌, భోజ్‌పూరి జిల్లా ఆగమా గ్రామానికి చెందిన రాజేశ్ (45), ఆయన కుమార్తె అంశు కుమారి, కుమారుడు విష్ణులు ఒకే మంచంపై నిద్రిస్తుండగా.. పాము కాటు వేసింది. దీంతో విషమెక్కి ముగ్గురు సాయం కోసం గట్టిగా అర్థించారు.
 
వీరి అరుపులతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు వీరిని ఆస్పత్రికి తరలించడం మాని స్థానికంగా ఉండే మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. అతను మంత్రం ద్వారా విషం తొలగిస్తున్నట్లు డ్రామా చేశాడు. చివరికి పాము విషం శరీరమంతా వ్యాపించడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments