Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం... 12 మంది దుర్మరణం

వరుణ్
బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (22:37 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను బెంగుళూరు - భాగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. జాంతారలోని కాలా ఝురియా రైల్వే స్టేషన్‌ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలైంది. అయితే, ఖచ్చితమైన సంఖ్యను ఇంకా అధికారులు ప్రకటించలేదు. అనసోల్‌ పరిధి జంతారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది ఘటనాస్థలానికి వైద్య బృందాలను, అంబులెన్స్‌లను తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
 
ఈ ప్రమాదం విషయం తెలియగానే వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కొంతమంది రైల్వే ట్రాక్ దాటుతుండగా అంగా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ఘటనపై 12 మంది చనిపోయారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments