రైతు రుణమాఫీ పథకం సాధారణంగా ఎన్నికలకు ముందు ఏ రాజకీయ పార్టీకైనా గేమ్ ఛేంజర్‌గా ఉంటుంది. ఎందుకంటే రుణ మాఫీ గతంలో అనేక పార్టీల భవిష్యత్తును మార్చింది. ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో వైసీపీ లేదా టీడీపీ-జనసేన రుణ మాఫీని ప్రకటిస్తుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల రాప్తాడులో జరిగిన సిద్ధం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ శిబిరంలో ప్రచారం జరిగింది. కానీ జగన్ అలాంటి ప్రకటనలేమీ దాటవేయడంతో అది జరగలేదు.
రుణమాఫీని ప్రకటిస్తే ప్రయోజ నాలేమీ లేవని వైకాపా క్లారిటీకి వచ్చేసింది. "నేను చేయలేనిది నేను వాగ్ధానం చేయలేను. రుణమాఫీ పథకాలను అమలు చేయడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్థికంగా లాభదాయకం కాదు." అంటూ వైకాపా సమావేశంలో వైసీపీ నేతలతో జగన్ క్లారిటీ ఇచ్చేసినట్లు సమాచారం.