ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు.. 56 అంగుళాల థాలీ రెడీ

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (17:52 IST)
Thali
సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26వరకు దేశవ్యాప్తంగా మోదీ పుట్టిన రోజు కార్యక్రమాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా హాజరుకానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున సన్నాహలు చేస్తున్నారు.
 
అందులో భాగంగానే ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ రుచికరమైన థాలీని అందించేందుకు రెడీ అయ్యింది. రెస్టారెంట్ యజమాని సుమిత్ర కల్రా ఏకంగా థాలీకి 56 అంగుళాల మోదీజీ అని పేరు పెట్టారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా రుచికరమైన వంటకాలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. మోదీ అంటే తమకు ఎంతో గౌరవమని తెలిపారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెస్టారెంట్ తరపున బహుమతి అందజేస్తామని తెలిపారు.
 
మోదీ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయా తేదీల మధ్య తమ రెస్టారెంట్లో ఫుడ్ తినే కస్టమర్లు 8లక్షల రూపాయల విలువచేసే ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. 56 అంగుళాల మోదీజీ థాలీని దంపతుల్లో ఎవరైనా 40 నిమిషాల్లో ఈ థాలీని పూర్తి చేస్తే వారికి రూ.8.5 లక్షలు బహుమతిగా అందజేస్తామన్నారు. 
 
అలాగే, సెప్టెంబరు 17-26 మధ్య మా రెస్టారెంట్‌ని సందర్శించి బహుమతి గెలుచుకున్నవారికి కేథార్ నాథ్, ఛార్ దామ్ యాత్రకు పంపించనున్నట్లు రెస్టారెంట్ యజమాని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments