Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎనిమిదేళ్ల తర్వాత తన భర్త "స్త్రీ" అని గుర్తించిన భార్య

Advertiesment
women romance with boss
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (12:25 IST)
కట్టుకున్న భర్తతో ఎనిమిది సంవత్సరాల పాటు కాపురం చేసిన తర్వాత ఆయన ఒక స్త్రీ అనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించింది. గత 2014లో విజయ్ వర్థన్‌ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న మహిళ... సంవత్సరాలు గడిచిపోతున్నా తనతో సన్నిహితంగా మెలగడం లేదు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీస్తే ప్రమాదం జరిగిందని నమ్మబలికే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కోల్‌కతాకు వెళ్లి లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. చివరకు ఆ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వడోదరకు చెందిన 40 యేళ్ల మహిళ గత 2014లో విజయ్ వర్థన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. గతంలో విజేత అనే యువతిగా ఉన్న విజయ్ వర్థన్‌తో ఓ మాట్రిమోనియల్‌ సైట్ ద్వారా బాధిత మహిళకు పరిచయం ఏర్పడింది. బాధిత మహిళ తన భర్త 2011లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వీరికి 14 యేళ్ల కుమార్తె ఉంది. ఆ తర్వాత ఆమె 2014లో విజయ్ వర్థన్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.
 
ఆ తర్వాత వారిద్దరూ హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్ళగా భార్యతో ఆయన సన్నిహితంగా ఉండలేక పోయారు. ప్రతిసారీ ఇదేవిధంగా చేస్తుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. అయినప్పటికీ పలు కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటూ వచ్చాడు. తాను రష్యాలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని, అప్పటి నుంచి శృంగారానకి పనికిరాకుండా పోయానని చెప్పాడు. ఆ తర్వాత జరిగిన చిన్నపాటి సర్జరీ తర్వాత అంతా సర్దుకుందని నమ్మబలికాడు. 
 
ఈ క్రమంలో గత 2020లో బరువు తగ్గించుకోవాలన్న సాకుతో కోల్‌కతాకు వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు. అక్కడ నుంచి వచ్చాక అసలు నిజం చెప్పాడు. లింగమార్పిడి చికిత్స చేయించుకుని పురుషుడుగా మారినట్టు చెప్పాడు. అంతకు మించి తనకేంమీ చెప్పలేదనీ ఆమె పోలీసులక ఓ ఫిర్యాదు ఇచ్చింది. పైగా, ఆయన తనతో అసహజ శృంగారం చేసేవాడనీ తన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు. దీంతో కేసు నమోదు చేసే విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓజోన్ పొర పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవం.. Ozone Layerను కాపాడండి..