Webdunia - Bharat's app for daily news and videos

Install App

ల్యాప్‌టాప్ చోరీ చేసిన దొంగ.. ఇంటికెళ్ళి సారీ చెపుతూ మెయిల్

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (14:07 IST)
ఓ దొంగ ఓ ఇంట్లోకి చోరీకి వచ్చి ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. ఆ తర్వాత ఇంటికెళ్లి సారీ చెబుతూ మెయిల్ పెట్టాడు. మరోదారి లేక దొంగతనం చేశానంటూ వివరణ ఇచ్చాడు. లాప్‌టాప్‌లోని ముక్యమైన ఫైల్స్‌ను పంపించాడు. ఈ మెయిల్‌ చూసిన ల్యాప్‌టాప్‌ యజమాని సంతోషించాలో.. బాధపడాలో తెలియట్లేదంటూ వాపోయాడు. 
 
"ఆర్థిక కష్టాల్లో ఉన్నాను... మరోదారి కనిపించక మీ ల్యాప్ టాప్ చోరీ చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి" అంటూ దొంగ సదరు ల్యాప్‌టాప్ యజమానికి మెయిల్ చేశాడు. అంతేకాకుండా, ల్యాప్‌టాప్‌లో ఉన్న పరిశోధన పత్రాలను పంపించి ఇంకా ఏమైన ముఖ్యమైన ఫైల్స్ ఉంటే చెప్పండి పంపించేస్తా అని అడిగాడు. దీంతో ల్యాప్‌టాప్‌ పోయినందుకు బాధపడాలో లేక కష్టపడి చేసిన పరిధోనకు సంబంధించిన ఫైల్స్ దక్కించుకునందుకు సంతోషించాలో తెలియట్లేదని ఆ యువకుడు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త వైరల్ అయింది. 
 
దొంగతనం చేస్తే చేశాడు కానీ విలువైన ఫైల్స్ పంపించాడు. ఎంతైనా మంచి దొంగేనని నెటిజన్లు కితాబిస్తున్నారు. జ్వైల్లీ థిక్సో అనే ట్విట్టర్ యూజర్ ఈ వివరాలను ట్వీట్ చేశాడు. "నిన్న రాత్రి నా ట్యాప్‌ టాప్‌ను ఎంతో దొంగిలించారు. ఈ రోజు ఉదయం నా మెయిల్ ఐడీ నుంచే నాకు మెయిల్ వచ్చింది. 
 
తెరిచి చూస్తే "నిన్న మీ ల్యాప్ టాప్‌ను ఎత్తుకెళ్లింది నేనే. చాలా కష్టాల్లో ఉన్న నాకు మరో దారి కనిపించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ పని చేయాల్సి వచ్చింది. ఇక ల్యాప్‌టాప్‌లో మీరు దాచుకున్న రీసెర్స్ ఫైల్స్‌ను ఈ మెయిల్‌తో పంపిస్తున్నా. లాప్ టాప్‌లో ఇంకా ఏమైనా ముఖ్యమైన ఫైల్స్ ఉంటే చెప్పండి. మీకు పంపించేస్తా. అయితే సోమవారం లోపే అడగండి. ఆ తర్వాత ఈ ల్యాప్ టాప్ నా దగ్గర ఉండదు అని ఉందని థిక్సో చెప్పాడు. పైగా, దొంగ పెట్టిన మెయిల్స్‌ను ల్యాప్‌టాప్ యజమాని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments